సింగర్ శ్రీరామచంద్ర తీవ్ర అసహనానికి గురయ్యారు. దానికి కారణం ఆయన వెళ్లాల్సిన గోవా ఫ్లైట్ మిస్ కావడమే. మరి ఆయన ఫ్లైట్ మిస్ ఐతే కేసీఆర్ , కేటీఆర్ మీద ఎందుకు అసహనం వ్యక్తం చేశారనుకుంటున్నారా..ఒక పొలిటీషియన్ వస్తున్న సందర్భంగా పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ ని బ్లాక్ చేశారు. దాంతో ట్రాఫిక్ అంత ఫ్లై ఓవర్ కింద ఉండిపోయింది. ఆ హెవీ ట్రాఫిక్ కారణంగా ఎయిర్ పోర్ట్ కి అరగంట ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చిందట. దాంతో ఆయన వెళ్లాల్సిన గోవా ఫ్లైట్ మిస్ అయ్యింది. గోవాలో ఒక ఈవెంట్లో పాల్గొనాల్సి ఉండడం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇలా ప్లాన్ అంతా చేంజ్ అయ్యేసరికి శ్రీరామచంద్ర తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఇలాంటి టైములో మరో ఫ్లైట్ ని క్యాచ్ చేసి గోవా వెళ్లడం ఎంతో కష్టమైన పని. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా ఆ ఫ్లైట్ మిస్ అయ్యారట. "తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారికి, సైబరాబాద్ పోలీసులకు నేను విన్నవించేది ఏమిటంటే.. పొలిటికల్ లీడర్స్ కోసం మాలాంటి సామాన్యులను ఇబ్బంది పెట్టకండి"... అంటూ ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేశారు.
సింగర్ శ్రీరామచంద్ర చేసిన ట్వీట్ కి మిశ్రమ స్పందన వచ్చింది. "ఈవెంట్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకా ముందుగా బయల్దేరాల్సింది" అని అంటే "ఎలాంటి రోడ్ షోస్ వంటివి ఉన్నప్పుడు ప్రజలకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలీదా..పొలిటీషియన్స్ కోసం మన విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవాలా " అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేశారు.